హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ ఫలితాలు ప్రకటించిన రోజే జాబితాలు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా, అధికారులు మాత్రం విడుదల చేయలేదు. ఓవైపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు సమీపిస్తుండగా, బుధవారం వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల 1:3 జాబితా విడుదల కాలేదు. మంగళవారం రాత్రి ఎస్జీటీ 1:3 జాబితా విడుదల కాగా, బుధవారం రాత్రి స్కూల్ అసిస్టెంట్, భాషాపండితులు, పీఈటీ పోస్టుల జాబితాలను అధికారులు వెబ్సైట్లో పొందుపరిచారు.
కొన్ని జిల్లాల్లో సూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు తొలిరోజు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ నిర్వహించారు. అధికారుల సమన్వయ లోపంతో అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురయ్యారు. కొంతమంది అభ్యర్థులకు అకనాలెడ్జ్మెంట్ సర్టిఫికెట్ ఇవ్వగా మరికొన్ని జిల్లాల్లో ఇవ్వలేదు.