హైదరాబాద్, నవంబర్ 14(నమస్తే తెలంగాణ) : సాధారణంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారులను నిర్మించ డం, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వాటిని నిర్వహించడం సర్కారు కనీస బాధ్యత. కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బాధ్యతను మ రిచి అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నది. రాష్ట్రంలోని రోడ్లను చూస్తుంటే.. అసలు ప్రభుత్వం పనిచేస్తున్నదా.. లేదా? అనే అనుమానం కలుగుతున్నది. చేసేదిలేక, రోడ్లపై గుంతల బాధ భరించలేక కొన్నిచోట్ల స్థానిక ప్రజాప్రతినిధు లు, మరికొన్నిచోట్ల ఆర్అండ్బీ అధికారులు మట్టితో రోడ్ల గుంతలు పూడ్చుకుంటున్నారు. వానకాలంలో పాడైపోయిన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు నిర్వహించి వర్షాలు తగ్గుముఖం పట్టాక శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరించడం ఆనవాయితీ.
ఏటా వర్షాకాలంలో వచ్చే భారీ వర్షాలకు రూ.1,500-2,000 కోట్ల వరకు రోడ్లకు నష్టం వాటిల్లుతుంది. తాత్కాలిక మరమ్మతుల కోసం 2000 మందికిపైగా లైసెన్స్డ్ కాంట్రాక్టర్లు, తగినన్ని బీటీ ప్లాంట్లు ఉన్నాయి. బీఆర్ఎస్ సర్కారు హ యాంలో వర్షాకాలంలో పాడైపోయిన రోడ్లను ఎప్పటికప్పుడు తాత్కాలిక పద్ధతిన మరమ్మతుచేసి పునరుద్ధరించేవారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోడ్ల మరమ్మతులను పూర్తిగా గాలికొదిలేశారు. హ్యామ్ ప్రాజెక్టు పేరుతో మరమ్మతులు కూడా చేయడంలేదు. మొంథా తుఫాన్ సహా వర్షాకాలం లో వచ్చిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 1,700 కి.మీకుపైగా రోడ్లు ధ్వంసమైనట్టు, వీటి మరమ్మతులకు రూ.2,500కోట్లు అవసరమవుతాయని అంచనాలు వేశారు. తాత్కాలిక మరమ్మతులకు రూ.100 కోట్లు కావాలని ప్రతిపాదించారు. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదు.
ప్రతిపాదనలు పంపినా పైసా ఇవ్వలే..
రోడ్ల మరమ్మతుల కోసం ఆర్అండ్బీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఫలితం లేకపోవడంతో నామమాత్ర నిర్వహణ నిధులతో గుంతలను మట్టితో పూడ్చుతున్నారు. సంగారెడ్డి, సిద్ధిపేట, జనగాం తదితర ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు తమ సొంత నిధులతో రోడ్లను మట్టితో పూడ్చేపని పెట్టుకున్నారు. ‘రోడ్లు సరిగా లేకుంటే మేమే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిధుల సమస్య గురించి ప్రజలకు తెలియదు కదా. మేమే పనులు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నామని అనుకుంటారు. అందుకే గుంతలను మట్టితోనే పూడ్చుతున్నాం.’ అని ఆర్‌అండ్‌బీకి చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. హ్యామ్ ప్రాజెక్టులో భాగంగా రోడ్ల మరమ్మతులకు ప్రత్యేక నిధులు ఇవ్వడంలేదని అభిప్రాయపడ్డారు. నిధుల మంజూరుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినా ఫలితం లేదని తెలిపారు. జిల్లా కేంద్రాలకు వెళ్లే రోడ్లు చాలా ప్రాంతాల్లో దెబ్బతిన్నాయని చెప్పారు.
మొంథా తుఫాన్‌తో దెబ్బతిన్న రోడ్లు, మరమ్మతులకు అవసరమైన నిధులు(కోట్లలో)
