ఇల్లంతకుంట/గన్నేరువరం/ఇచ్చోడ/ఇంద్రవెల్లి/నార్నూర్, అక్టోబర్ 21: రైతన్న రెక్కల కష్టం.. వర్షం కారణంగా వృథా అవుతున్నది. సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దయింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, ముస్తా బాద్, చందుర్తి, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలాల్లో వర్షం కురవడంతో రైతులు ధాన్యాన్ని కాపాడుకోలేక పోయారు. ఆదిలా బాద్ జిల్లా సిరికొండలోని వ్యవసాయ భూము ల్లో ఆరబోసిన మక్క, జొన్న, సోయా, ఇంద్రవె ల్లిలో మక్కజొన్న, నార్నూర్‌లో మక్క, సో యా, పెసర పంటలు తడిసిపోయాయి.