మందమర్రి రూరల్/నెన్నెల/రెబ్బెన, మే 31: మంచిర్యాల జిల్లాలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. మందమర్రి మండలం సారంగపల్లి, చిర్రకుం ట, మామిడిగట్టు, ఆదిల్పేట, పొన్నారం గ్రామాల్లో వర్షం పడింది. అక్కడక్కడా చెట్లు విరిగిపడ్డాయి. మామిడిగట్టులో ఓ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఆదిల్పేటలో పలుచోట్ల విద్యుత్తు స్తంభా లు విరిగిపడ్డాయి. కరెంట్ తీగలు తెగిపోయాయి. పలుచోట్ల కొనుగోలు కే్రందాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. గాలిదుమారానికి జెండా వెంకటాపూర్లో చెట్ల కొమ్ములు విరిగిపడటంతో 15 విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి.
పిడుగుపడి దంపతుల మృతి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగుపడి దంపతులు మృతి చెందారు. తిర్యాణి మండలం చెల్మెల కొలాంగూడకు చెందిన టేకాం భీము (50), టేకాం రాజుబాయి(45) ఖైర్గూడలోని చేను లో పనిచేస్తుండగా ఒక్కసారిగా పిడుగుపడటంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. సమీపంలో ఉన్న ఆత్రం గంగుకు గాయాలయ్యాయి.