హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): గుంటూరు, హైదరాబాద్లో ఉన్న విజ్ఞాన్ యూనివర్సిటీల్లో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, ఫార్మా-డీ ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన వీ సాట్-2025 ఫేజ్-1 ప్రవేశ ఫలితాలు వర్సిటీ వీసీ కల్నర్ ప్రొఫెసర్ పీ నాగభూషణ్ శనివారం విడుదల చేశారు. వీ సాట్లో 1 నుంచి 50లోపు ర్యాంకులు సాధించిన వారికి 50శాతం, 51 నుంచి 200లోపు ర్యాంకులు వచ్చినవారికి 25శాతం, 201 నుంచి 2000లోపు ర్యాంకులు సాధించిన వారికి పదిశాతం స్కాలర్షిప్లు నాలుగేండ్లపాటు అందిస్తామని వెల్లడించారు.
ప్రవేశాలకోసం 16నుంచి 20వరకు మొదటి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటర్లో 970కి పైగా మార్కులు సాధించిన వారికి 50శాతం, 950 నుంచి 969 మార్కులు తెచ్చుకున్నవారికి 25శాతం, 920 నుంచి 949 మార్కులు సాధించిన విద్యార్థులకు పదిశాతం స్కాలర్షిప్లు అందజేస్తామని తెలియజేశారు.
రవితేజ(అనంతపురం), నాగేండ్ల సస్వత్ ప్రణయ్(నరసరావుపేట), ఆర్ సాయితేజ(వరంగల్), కే మహేశ్(విశాఖపట్నం), ప్రియతం కార్తీక్(విజయవాడ), ఏ సాయి సంతోష్రామ్(ఏలూరు), కొప్పుల హర్షిల్(కృష్ణా), ఏ దేవి శ్రీ చరిత్( మార్టూరు), షేక్ సమీర్బాబు(గుంటూరు).