హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుభిక్ష పాలన అందించి కొత్త ఒరవడిని సృష్టించారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిందే తడవుగా 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన విధంగానే ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు.
అదే స్ఫూర్తితో నూతన సంవత్సరంలోనూ సంక్షేమం,అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు నూతన సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు వారి వారి అభ్యున్నతికి దోహదపడాలని ఆకాంక్షించారు.