రేగొండ, ఏప్రిల్ 12 : ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధి.. కాగితాలు, శిలా ఫలకాలు, ఎమ్మెల్యేల టూర్లకే పరిమితమయ్యాయని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమాణారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో మండలంలోని రూపిరెడ్డిపల్లె, దమ్మనపేట, రాయపల్లె, కనిపర్తి, నాగుర్లపల్లి, రేపాక, మడుత్తపల్లి, పొనగల్లు గ్రామాల్లో మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించగా, మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2028లో కారు సర్కారు రావడం ఖాయమని, అందుకు వరంగల్ సభ నాంది అవుతుందని చెప్పారు. 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ సభకు భారీగా ప్రజలు తరలిరావాలని కోరారు.