మిర్యాలగూడ టౌన్, డిసెంబర్10 : దేశంలో రైతు ఎజెండాపై బీఆర్ఎస్ను స్థాపించడాన్ని స్వాగతిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 13 నుంచి 16 వరకు కేరళలోని తిరుచూర్లో అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు జరుగుతున్నాయని, దేశవ్యాప్తంగా రైతు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్టు తెలిపారు. ఈ నెల 16న లక్షలాది మంది రైతులతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.