Build Now Portal | హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన అనుమతులన్నీ ఒక గొడు గు కిందకు తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘బిల్డ్ నౌ’ పేరిట తీసుకొస్తున్న పోర్టల్ గు రించి మున్సిపాలిటీ అధికారులు, రియల్ వ్యాపారులు, ప్రజలకు పూర్తిగా అవగాహ న రాలేదు. అయినప్పటికీ ఫిబ్రవరి ఒకటి నుంచి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు ఇటీవల ప్రకటించారు.
అయితే మున్సిపాలిటీలలో ‘బిల్డ్ నౌ’ గురించి గాని, అందుకు సంబంధించిన పోర్టల్ గురించి కాని, దీని ద్వారా రియల్ అనుమతులు ఎలా మంజూరు చేయాలి? వ్యాపారులు పోర్టల్‌లో సమాచారం ఎలా అప్లోడ్ చేయాలి ? తదితర విషయాలపై అస్పష్టతగానే ఉందని అం టున్నారు. కొత్తగా వచ్చే పోర్టల్‌పై మున్సిపల్ కమిషనర్లకు, క్షేత్ర స్థాయి అధికారులకు, సిబ్బందికి కనీసం అవగాహన కల్పించలేదు.