హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో తప్పుల మీద తప్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టీచర్లు ఎం చుకున్న వెబ్ ఆప్షన్లు గాయబ్ అయ్యా యి. ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు చేపడుతుండడంతో టీచర్లంతా వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. ఇక బదిలీల ఉత్తర్వులొస్తాయని వేచి చూస్తుండగా ‘మీ వెబ్ ఆప్షన్లు డిలీట్ అయ్యాయి తక్షణమే.. మళ్లీ వెబ్ ఆప్షన్లు ఎంచుకోండి’ అని హైదరాబాద్ డీఈవో నుం చి టీచర్లకు సమాచారం అందింది. దీం తో టీచర్లంతా మళ్లీ వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాల్సి ఉంది. మరికొన్ని జిల్లాల్లోను ఇదే తరహాలో వెబ్ ఆప్షన్లు డిలీట్ కాగా, మళ్లీ ఎంచుకోవాలని ఆయా టీచర్లకు సమాచారామిచ్చినట్టు ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. ఆన్లైన్ అంటే సులభతరం కావాలి.. కానీ ఇలా తలనొప్పులేంటని టీచర్లు వాపోతున్నారు.