హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ బదిలీల్లో మొదటి ప్రక్రియ అయిన జీహెచ్ఎం (గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు) బదిలీల వెబ్ ఆప్షన్ల గడువు శనివారం ముగియనున్నది. వీరికి శుక్ర, శనివారాల్లో వెబ్ ఆప్షన్లకు విద్యాశాఖ అవకాశం కల్పించించిన విషయం తెలిసిందే.
కాగా, ఈ నెల 17న బదిలీ ఉత్తర్వులు విడుదలవుతాయి. ఒకేచోట ఐదేండ్ల సర్వీసు పూర్తిచేసుకొన్న హెచ్ఎంలంతా బదిలీ ఆప్షన్లు ఎంచుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.