Weather Update | తెలంగాణలో రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాబోయే మూడురోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హమూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు వానలు పడుతాయని చెప్పింది.
మంగళవారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. ఆయా జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో వికారాబాద్, యాదాద్రి భువనగిరి, జనగాం, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌లో అత్యధికంగా 2 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీజీడీపీఎస్ పేర్కొంది.
Read Also : Harish Rao | సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సవాలు