హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రానున్న రెండ్రోజులపాటు పొడి వాతావరణంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తకువగా నమోదుకానున్నట్టు పేర్కొన్నది.
దీంతో ఆదిలాబాద్, కుమ్రంభీంఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, వికారాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్, హైదరాబాద్, నాగర్కర్నూల్, జగిత్యాల, మహబూబ్నగర్, వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. గత 24 గంటల్లో కుమ్రంభీంఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత 7.1 డిగ్రీలుగా నమోదైనట్టు వెల్లడించింది.