హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని భాగ్యనగర్ టీఎన్జీవోస్ సొసైటీ పరిధిలోని ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. టీఎన్జీవో నేతలు మారం జగదీశ్వర్, ముజీబ్హుస్సేన్, ఎం సత్యనారాయణగౌడ్, సత్యనారాయణ సోమవారం డిప్యూటీ సీఎంను కలువగా ఈయన ఈ మేరకు హామీ ఇచ్చారు.