సామగ్రి కొరత నిజమే.. టీఎస్ఐపాస్ కనెక్షన్లపై ‘నమస్తే తెలంగాణ’ కథనం వాస్తవికమైనదే
దక్షిణ డిస్కమ్ స్టోర్లలో సామగ్రి కొరత ఉన్నమాట నిజమేనని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ స్పష్టం చేశారు. సరైన ప్రణాళికతో త్వరలోనే ఈ సమస్యను అధిగమిస్తామని తెలిపారు. టీఎస్ఐపాస్కు సంబంధించిన కనెక్షన్లపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం వాస్తవికమైనదేనని ఆయన అంగీకరించారు.
- ఆ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం: దక్షిణ డిస్కమ్ సీఎండీ
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ) : దక్షిణ డిస్కమ్ స్టోర్లలో సామగ్రి కొరత ఉన్నమాట నిజమేనని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ స్పష్టం చేశారు. సరైన ప్రణాళికతో త్వరలోనే ఈ సమస్యను అధిగమిస్తామని తెలిపారు. టీఎస్ఐపాస్కు సంబంధించిన కనెక్షన్లపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం వాస్తవికమైనదేనని ఆయన అంగీకరించారు. అయితే ఇందులో సంబంధిత మంత్రికి ఎలాంటి సంబం ధం లేదని, ఇది పూర్తిగా డిస్కమ్కు సంబంధించిన వ్యవహారమేనని చెప్పారు. జితేశ్ బుధవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు కోసం టీఎస్ఐపాస్లో దరఖాస్తు చేసుకున్నవారికి విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వడంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సంబంధిత విభాగాన్ని ఆదేశించామని, త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు.
టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని 33కేవీ, 11కేవీ లైన్ల నిర్వహణను వచ్చే నెలాఖరులోగా క్రమబద్దీకరిస్తామని చెప్పారు. కొత్తగా 75 సబ్స్టేషన్లు సిద్ధమయ్యాయని, వీటి ద్వారా విద్యుత్తు సరఫరా సజావుగా సాగుతుందని తెలిపారు. సీఎండీగా తాను బాధ్యతలు చేపట్టాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, నోటరీల సమస్యను పరిష్కరించానని చెప్పారు. దీన్ని కొందరు దళారులు తమకు అనుకూలంగా మార్చుకుని వినియోగదారులను మోసగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. దక్షిణ డిస్కమ్ పరిధిలోని విద్యుత్తు వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని, వినియోగదారులు తనను కలిసేందుకు ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కార్యాలయంలో అందుబాటులో ఉంటానని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

