హైదరాబాద్: రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం జనం రోడ్లెక్కుతున్నారు. పది నెలల్లోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న రేవంత్ సర్కార్‌పై ప్రజలు తిరగబడటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. తెలంగాణలో మరోసారి ఉద్యమం నాటి పరిస్థితులు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీయే మళ్లీ ప్రత్యర్థి అని, ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని తెలిపారు. రైతు భరోసా, రైతు రుణమాఫీతో రైతులను దోఖా చేయడం అమానుష మని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దుర్మార్గమంటూ మండిపడ్డారు.
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల జాతర అనే హామీకి పాతరేసి నిరుద్యోగుల ఆశలను చిదిమేశారని, రోడ్డెక్కినా కనికరించడం లేదని విమర్శించారు. నాడు బీఆర్ఎస్ హయాంలో సకల జనుల సంక్షేమ తెలంగాణ..నేడు కాంగ్రెస్ పాలనలో సంక్షోభం వైపు పయనిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే తెలంగాణ అగ్గై మండుతున్నదని, సర్కార్ విధానాలపై జనం తిరగబడుతున్నారని వెల్లడించారు. తెలంగాణ దళం, గళం ఎప్పటికీ బీఆర్ఎస్సేనని, పేగులు తెగేదాకా ప్రజల కోసం కొట్లాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణను అవకాశవాదుల నుంచి కాపాడుకుంటామని తెలిపారు.
తెలంగాణలో ఉద్యమం నాటి పరిస్థితులు..
మళ్లీ ప్రత్యర్థి కాంగ్రెస్సే..ప్రజల పక్షానా బీఆర్ఎస్సే!!
రైతు భరోసా, రైతు రుణమాఫీతో రైతులను దోఖా చేసిన అమానుషం..ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయని దుర్మార్గం..
ఏడాదిలో 2లక్షల ఉద్యోగాల జాతర అనే హామీకి పాతరేసి నిరుద్యోగుల ఆశలను చిదిమేసిన… pic.twitter.com/EC8BGUBnxk
— KTR (@KTRBRS) October 26, 2024