హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరిస్తే ఊరుకోబోమని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ కన్వీనర్ పీ రత్నాకర్‌రావు, కో కన్వీనర్ బీసీరెడ్డి హెచ్చరించారు. నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజినీర్స్ పిలుపు మేరకు మంగళవారం జెన్కో కార్యాలయం ఎదుట ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రత్నాకర్‌రావు, బీసీరెడ్డి మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, చండీగఢ్‌లలో విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారని వాపోయారు. ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. నిరసనలో జేఏసీ నేతల ఈశ్వరయ్య, సదానందం, మనోరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సురేశ్‌కుమార్, కిరణ్, బాగయ్య, సతీశ్, వెంకటేశ్, భాస్కర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తేతెలంగాణ): టెట్- 2024ను గురువారం నుంచి నిర్వహించనున్నారు. మంగళవారం పాఠశాల విద్యాశాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. 20 వరకు నిర్వహించనున్న పరీక్షకు 2,75,753 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. 92 సెంటర్లు ఏ ర్పాటు చేశామని, వివరాలకు 900075 6178, 7075088812, 7075028881 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.