వరంగల్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతంగా నిర్వహించి తీరుతామని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ స్పష్టంచేశారు. ఈ నెల 27న జరగనున్న రజతోత్సవ మహాసభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారని చెప్పారు.
హనుమకొండ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ 60 లక్షల పార్టీ సభ్యత్వాలు కలిగిన గు లాబీ కుటుంబమని చెప్పారు. ఈ సందర్భంగా హనుమకొండలోని త్రిచక్ర పొ దుపు, పరపతి పరస్పర సహకార సం ఘం రజతోత్సవ సభకు రూ.లక్షా నూట పదహార్ల విరాళాన్ని ప్రకటించింది. సం ఘం బాధ్యులు ఆ చెక్కును వినయ్‌భాస్కర్‌కు అందజేశారు. మహాసభకు 800 ఆటోలతో తరలివస్తామని ప్రకటించారు.