హైదరాబాద్, నవంబర్27 (నమస్తే తెలంగాణ): ఎన్నికల హామీ మేరకు దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు వీలైనంత త్వరగా పెంచుతామని మహిళా, శిశు, దివ్యాంగుల సం క్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న దివ్యాంగుల రా్రష్ట్రస్థాయి క్రీడాపోటీలను మంత్రి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ త్వరలోనే దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలనూ నింపుతామని తెలిపారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.