హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో ప్రజలు సుఖంగా, స్వేచ్ఛగా ఉన్నారని, ఎన్నికలు ఇంకో ఏడాది ఉందన్నప్పుడు పింఛన్లను పెంచి ఇస్తాం’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రుణమాఫీ, ఉచిత బస్సుతో రైతులు, మహిళల సంతోషంగా ఉన్నారని, ప్రజలకు కావలసిన స్వేచ్ఛా, స్వాతంత్య్రాలని అవి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు. ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉన్నదని, వాటిని చేసుకుంటూ పోతామని అందులో పింఛన్లూ ఒకటని తెలిపారు.