మహబూబ్‌నగర్, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ సర్కార్ కక్షపూరితంగా పడావు పెట్టింది.. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు అవుతున్నా ఇప్పటివరకు తట్టెడు మట్టి తీయలేదు’ అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం ప్రకటనలో విమర్శించారు. పీఆర్ఎల్ఐ పనులు కేసీఆర్ హ యాంలోనే 90% పూర్తి చేశారని, కేవలం పది శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయని, పం ప్హౌస్ల నుంచి టన్నెలింగ్ వరకు కంప్లీట్ అయ్యిందని గుర్తు చేశారు. కాల్వల కోసం టెండర్లు పిలిచి ఖరారు చేశామని.. కాంగ్రెస్ సర్కార్ రాగానే వాటిని రద్దు చేసిందని ఆరోపించారు.
ఆ టెండర్లు నిర్ధారించిన పనులు పూర్తి చేసి ఉంటే ఈ రోజు ఉమ్మడి జిల్లాలోని నాలుగు రిజర్వాయర్లు నీటితో కళకళలాడు తూ ఉండేవని చెప్పారు. ఈ పనులు పూర్తి చేస్తే కేసీఆర్‌కు ఎక్క డ పేరు వస్తుందోన ని కాంగ్రెస్ ప్రభు త్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. రైతుల ప్రయోజనా లు దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టును చేపట్టాలని సర్కార్‌పై ఒత్తిడి పెంచేందుకు పాదయాత్ర చేపడుతున్నామని స్పష్టం చేశారు.
పీఆర్ఎల్ఐ పూర్తికి త్వరలో పాదయాత్ర నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు ప్రకటన రాగా సర్కార్ భయపడి హడావుడిగా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించిందని విమర్శించారు. సమీక్షలో ఉన్నతాధికారులు, ప్రాజెక్టు ఈఎన్సీ ఎవరూ లేకుండా చర్చించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటివరకు ఒక్క రోజు కూడా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చూసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. నార్లాపూర్, ఏదుల పంప్‌హౌస్, వట్టెం పంప్‌హౌస్ రిజర్వాయర్లను చూసి బుద్ధి తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు.