హాలియా, ఫిబ్రవరి 22 : కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా పరిరక్షణ కోసం పోరాడేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నదని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. శనివారం ఆయన నల్లగొండ జిల్లా హాలియాలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రా జలదోపిడీ యథేచ్ఛగా కొనసాగుతుందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పరిపాలన అనుభవం లేదని, అలాంటి వ్యక్తి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం కొనసాగడం దౌర్భాగ్యమని పే ర్కొన్నారు. సీఎంతోపాటు మంత్రులకూ విష య పరిజ్ఞానం లే దని విమర్శించా రు. కృష్ణా జలాల వినియోగంపై రాష్ట్ర పునర్విభజన సమయంలోనే ఇరు రాష్ర్టాల మధ్య జరిగిన తాత్కాలిక ఒప్పందాన్ని ఏపీ ఉల్లంఘిస్తున్నదని ఆరోపించారు. కృష్ణా జలాలను అక్రమంగా తీసుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.