స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 10: పార్టీ ఫిరాయింపుల విషయమై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అయిపోలేదని, ఇంకా బెంచ్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. మంగళవారం ఆయన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పును గౌరవిస్తామని అన్నారు. న్యాయ నిపుణుల సలహాల మేరకు భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. గతంలో సుప్రీం కోర్టు రెండు రకాల తీర్పు ఇచ్చిందని, హైకోర్టు, సుప్రీం కోర్టులు భిన్నమైన తీర్పులు ఇచ్చినట్టు తెలిపారు. హైకోర్టు తీర్పుతో ఏదో అయిపోయిందని, అప్పుడే ఉపఎన్నిక వచ్చినట్టుగా కొందరు సంబురాలు చేసుకోవడం సరికాదని, అసలు ఉప ఎన్నికలు వస్తాయో లేదో తెలియదని అన్నారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు కాపీలు ఇంకా తమకు అందలేదని పేర్కొన్నారు.