కేసు ఎత్తివేయకుంటే ఆత్మహత్యే
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల బీఆర్ఎస్ సోషల్ మీడి యా ప్రధాన కార్యదర్శి సల్వాజీ మాధరావుపై కాంగ్రెస్ నాయకులు పెట్టిన అట్రాసిటీ కేసును ఎత్తివేయకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇంటి ఎదుటే చచ్చిపోతామని ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశా రు.
- ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇంటి ఎదుటే చచ్చిపోతాం
- బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి సల్వాజీ మాధవ రావు కుటుంబ సభ్యుల ప్రకటన
ధర్మారం, ఏప్రిల్ 13: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల బీఆర్ఎస్ సోషల్ మీడి యా ప్రధాన కార్యదర్శి సల్వాజీ మాధరావుపై కాంగ్రెస్ నాయకులు పెట్టిన అట్రాసిటీ కేసును ఎత్తివేయకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇంటి ఎదుటే చచ్చిపోతామని ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశా రు. రెండ్రోజుల కింద మాధరావును అట్రాసిటీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో శనివారం మాధవరావు తల్లిదండ్రులు సల్వాజీ మారుతీరావు, రాజవ్వ, అతని సోదరి మాధవి ధర్మారంలో మీడియాతో మాట్లాడారు.
మాధవరావు అధికార పార్టీని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు కక్షగట్టి గత నెలలో తీవ్రంగా దాడి చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పు డు లేని విషయాన్ని సృష్టించి, కాంగ్రెస్ యూ త్ నాయకుడిని ఎస్సీ కులం పేరిట దూషించాడని అక్రమంగా కేసు నమోదు చేయించి అరెస్ట్ చేయించారని, ఇది ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పనేనని పేర్కొన్నారు. తమ కొడుకు పై కేసును ఎత్తివేసి జైలు నుంచి విడుదల చేయించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మాధవరావు తల్లిదండ్రులను బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పు ల ఈశ్వర్ పరామర్శించారు. పార్టీపరంగా, వ్యక్తిగతంగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. మాధవరావుపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై ఎందుకు కేసు నమో దు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

