హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత కార్డులపై నగదు రహిత సేవలను కొనసాగిస్తామని తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(టీఎస్‌హెచ్‌ఏ) తెలిపింది. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో శనివారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని గతంలో హెచ్చరించిన నేపథ్యంలో.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వారితో చర్చలు జరిపారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ద్వారా చెల్లించాల్సిన బకాయిలపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి త్వరలోనే విడుదల చేయిస్తామని హామీ ఇచ్చారు. నెలవారీగా చెల్లింపులు జరిగేలా చూస్తామని చెప్పారు. దీంతో టీఎస్‌హెచ్‌ఏ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నది.