హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తేతెలంగాణ): తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కారు అన్నివిధాలా అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం సెక్రటేరియట్లో గద్దర్ సినిమా అవార్డుల ఎంపిక కోసం విధివిధానాల ఖరారుకు అవార్డుల ఎంపిక కమిటీతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కమిటీ చైర్మ న్ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.