హైదరాబాద్, మార్చి 28 (నమస్తేతెలంగాణ) : పాడి రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని విజయ డెయిరీ యాజమాన్యం పనిచేయాలని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సూచించింది. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన కమిషన్ కార్యాలయంలో విజయడెయిరీ సంస్థపై సమీక్షాసమావేశం నిర్వహించారు. విజయ డెయిరీ కార్యకలాపాలపై త్వరలో కమిషన్ ఒక నిర్దిష్టమైన పాలసీ రూపొందించి ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించింది.
పాడి పశువుల పెంపకంలో సాంకేతికతను ఉపయోగించాలి
పాడి పశువుల పెంపకంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా రాణించాలని పశువైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ శరత్చంద్ర పేర్కొన్నారు. పశువైద్య విస్తరణ విభాగం, పశువైద్య కళాశాల రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో పాడిపశువుల రంగంలో ఐసీఆర్, పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం రూపొందించిన వివిధ ఆవిషరణలపై బుధవారం వర్షాప్ నిర్వహించారు.