దామరగిద్ద, ఏప్రిల్ 27 : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మల్రెడ్డిపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలతోపాటు భారత పౌరులందరి కోసం రాజ్యాంగాన్ని రచించి వాటి ఫలాలు అందరికీ అందించడానికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. అనంతరం ఆటపాటలతో అలరించారు.