హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఈనెల 18న నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్‌కు సిద్ధం కావాలని రాష్ట్ర ప్రజలకు బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేశ్ మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
ఈ నెల 15, 16 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో రెండురోజుల పాటు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ‘చాయ్‌తో చర్చ’ కార్యక్రమం నిర్వహించాలని బీసీ నేతలకు సూచించారు.