హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : పల్లెల అభివృద్ధికి పార్టీలకతీతంగా ఐక్యంగా పనిచేయాలని నూతన సర్పంచ్లు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ప్రజల తీర్పును బాధ్యతగా స్వీకరించి పారదర్శక పాలనతో గ్రామాలను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు ముగియడం సంతోషకరమని, ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేసిన ఎస్ఈసీకి, సహకరించిన పోలీస్, ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి మంత్రి సీతక బుధవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. నూతన సర్పంచ్లు, వార్డు సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు చెప్పారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజాసేవకు అంకితం కావాలని మంత్రి సీతక్క సూచించారు.
వికారాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. సొంతూరైన దోమ మండలం శివారెడ్డిపల్లిలో ఓటేసిన ఎమ్మెల్యే అనంతరం ఓటర్లను ప్రలోభపెట్టారు. ఏకంగా పోలింగ్ కేంద్రం సమీపంలో కుర్చీ వేసుకొని కూర్చొని కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. గంటపాటు పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీ వేసుకొని ఓటేసేందుకు వెళ్లే వారికి కాంగ్రె స్ అభ్యర్థికి ఓటేయాలని ప్రచారం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినప్పటికీ పోలీసులు, అ ధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు సొంతూరులో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతారేమోననే భయంతోనే ఎమ్మెల్యే ఓటర్లను ప్రలోభపెట్టారని స ర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.