హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో తలపెట్టిన ఇథనా ల్ ఫ్యాక్టరీతో తమ కుటుంబానికి సంబంధం లేదని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టంచేశా రు. కంపెనీలో తన కుమారుడు సాయి కిరణ్కిరణ్ ఓ డైరెక్టర్‌గా ఉ న్నారన్న కాంగ్రెస్ నేతల ఆరోపణల పై మంత్రి స్పందించారు. కాంగ్రెస్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన తేల్చిచెప్పారు. కంపెనీలో తమకు భాగస్వామ్యం ఉన్నట్టు రుజువు చేస్తే ఆ కంపెనీని అప్పగించేందుకు సిద్ధమని సవాల్ చేశారు.