హైదరాబాద్: గ్రాండ్గా ఉండే తెలంగాణ తల్లిని తీసి.. బీద తల్లిని పెట్టామని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్తున్నాడని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. తెలంగాణ మహిళలు ఎప్పటికీ పేదగానే ఉండాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తల్లిని తాము తిరస్కరిస్తున్నామని చెప్పారు. ఉద్యమ తల్లే తమ తల్లి అని, హస్తం గుర్తు తల్లిని ఆమోదించేది లేదన్నారు. రేవంత్ పిట్ట బెదిరింపులకు భయపడేవారు ఎవరూలేరన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పునకు నిరసనగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యమకారులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. జొన్నలు, మక్కలు ఇతర రాష్ట్రాల్లో కూడా పండుతాయి. పూలనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణది. తెలంగాణ తల్లి చేతి నుంచి బతుకమ్మను తొలగించారు. తెలంగాణ ప్రత్యేకతే బతుకమ్మ.
మహిళలకేమో విగ్రహాలు.. మగవాళ్లకేమో వరాలా అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లిని మార్చి కాంగ్రెస్ తల్లిని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. 9 మంది తెలంగాణ కవులు, కళాకారులకు స్థలాలు, డబ్బులిస్తామన్నరు. గుర్తింపునకు మల్లు స్వరాజ్యం, విమలక్క, సంధ్య పనికిరారా అని ప్రశ్నించారు. గ్రాండ్గా ఉండే తల్లిని తీసేసి.. బీద తల్లిని పెట్టినమని రేవంత్ గొప్పలు చెప్తుండు. తెలంగాణ మహిళలు ఎప్పటికీ పేదగానే ఉండాలా అన్ని ప్రశ్నించారు.
మీ నోటి నుంచి ఎరుకల నాంచారమ్మ, బీడీ కార్మికుల మహిళల పేరు రాలేదన్నారు. ఉద్యమ కాలంలో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లిని మార్చారని విమర్శించారు. విగ్రహం పెట్టామని చెప్పి సామన్య మహిళలకు ఇచ్చిన హామీలు ఎగ్గొడతారా అని నిలదీశారు. కాంగ్రెస్ తల్లిని తాము తిరస్కరిస్తున్నామని చెప్పారు. ఉద్యమ తల్లే మా తల్లి.. హస్తం గుర్తు తల్లిని ఆమోదించేది లేదన్నారు. రేవంత్ పిట్ట బెదిరింపులకు ఎవరూ భయపడరని తెలిపారు.
Live: తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు.@RaoKavitha
https://t.co/rXdYFRnhr9— BRS Party (@BRSparty) December 10, 2024
తెలంగాణ భవన్ లోని తెలంగాణ తల్లికి పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేసిన ఎమ్మెల్సీ @RaoKavitha మరియు బీఆర్ఎస్ నాయకులు. pic.twitter.com/UydNeZFZFR
— BRS Party (@BRSparty) December 10, 2024