కరీంననగర్ : ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి ఏ కులం, వర్గానికో ఆపాదించరాదని, రాజకీయ కోణంలోనే దానిని చూడాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవితపై అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ అరవింద్ మున్నూరు కాపు అయినంత మాత్రాన ఈ దాడిని మున్నూరు కాపుపై దాడిగా భావించరాదని సూచించారు.
అరవింద్ హుందాగా మాట్లాడాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కవితను తెలంగాణ ఆడబిడ్డగా గౌరవించుకోవల్సిన బాధ్యత అందరి పై ఉందని అన్నారు. దాడులపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.