తొర్రూరు, జూన్ 8: విత్తనాల బ్లాక్ మార్కెట్‌తో తమకు ప్రమేయం లేదని సస్పెండైన ఏఈవోలు స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలానికి కేటాయించిన పచ్చిరొట్ట, జీలుగ విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించి విక్రయించిన ఘటనలో మండల వ్యవసాయ అధికారితోపాటు ముగ్గురు ఏఈవోలను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఏఈవోలు ఈ దందాతో తమకు ప్రమేయం లేదని కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. అనంతరం తొర్రూరులో హరిపిరాల ఏఈవో సీహెచ్ అరవింద్, అమ్మాపురం ఏఈవో దీపిక, వెలికట్ట క్లస్టర్ ఏఈవో జమున మాట్లాడుతూ.. మండల వ్యవసాయ అధికారి కుమార్‌యాదవ్ మే 22న ఉదయం వాట్సాప్ గ్రూప్‌లో విత్తన కేటాయింపుల గురించి వివరాలు పెట్టినట్టు తెలిపారు. ఈ సమాచారం అందించి విక్రయ కేంద్రం నుంచి కేటాయింపులు చేసేలోపే, తమ ప్రమేయం లేకుండా ఆన్లైన్లోనే రైతుల పేరిట పర్మిట్లు జారీ చేశారన్నారు. తప్పుడు నివేదకతో తమను సస్పెండ్ చేయడం బాధాకరమని వారు పేర్కొన్నారు.