KTR | తమను రాజకీయంగా ఎదుర్కోలేక తమ కుటుంబం, బంధువుల మీద అక్రమ కేసులు బనాయించి మా మానసిక స్థైర్యం దెబ్బతీయాలని రేవంత్ సర్కార్ చూస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తాము ఉద్యమంలోకి అడుగుపెట్టిన నాడే చావుకు తెగించి వచ్చినోళ్లమని.. ఈ కేసులకు చిల్లర ప్రయత్నాలకు భయపడేటోళ్లం కాదని స్పష్టం చేశారు.
పొద్దున నాలుగు బాటిళ్లు దొరికాయని ఎక్సైజ్ కేసు పెడుతున్నామని చెప్పారని కేటీఆర్ తెలిపారు. కానీ సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా మారిపోయిందని అన్నారు. ఎన్డీపీఎస్లో 25, 27, 29 సెక్షన్లు పెట్టారు. అసలు ఆ సెక్షన్లు ఏంటి? సప్లయర్, కన్సెప్షన్, కోహోస్ట్ అని తెలిపారు.అసలు సప్లయర్ అనే సెక్షన్ పెట్టాలంటే అక్కడ డ్రగ్స్ దొరికి ఉండాలి లేదా ఎవరో ఒకరు సప్లై చేసి ఉండాలి.. అసలు డ్రగ్సే దొరకలేదని మీరే చెప్తుంటే, ఎలా పెడతారండి కేసు అని అడిగారు.
అక్కడ 14 మందికి టెస్ట్ చేస్తే 13 మందికి నెగటివ్ వస్తే.. ఒకరికి పాజిటివ్ వస్తే ఆయన ఎక్కడ తీసుకున్నాడో తెలుసుకోకుండా ఎలా కేసు పెడతారు. మత్తుపదార్థం దొరికిందా? ఏ రకంగా బద్నాం చేస్తారు అని ప్రశ్నించారు. ఇక మూడోది కో హోస్టింగ్.. అసలు హోస్టింగ్ లేకుంటే కో హోస్టింగ్ ఎక్కడిదని ప్రశ్నించారు.
మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక మా కుటుంబం, బంధువుల మీద అక్రమ కేసులు బనాయించి, కుట్రలు చేసి మా మానసిక స్థైర్యం దెబ్బ తీయాలని చూస్తున్నది రేవంత్ సర్కార్
మేము ఉద్యమంలో అడుగుపెట్టిన నాడే చావుకు తెగించి వచ్చినోల్లం ఈ కేసులకు.. చిల్లర ప్రయత్నాలకు బయపడేటోళ్లం కాదు.
– బీఆర్ఎస్ వర్కింగ్… pic.twitter.com/MjarolAr2y
— BRS Party (@BRSparty) October 27, 2024
‘ నన్ను, మా పార్టీని ఎదుర్కోలేక మా గొంతు నొక్కడానికి మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని రేవంత్ అనుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మా చేతుల్లో అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లు వాడతమని రేవంత్ అనుకుంటే కుదరదని అన్నారు. చావుకు తెగించి వచ్చినవాళ్లం.. వెనక్కి తగ్గామని.. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని చెండాడుతూనే ఉంటామని హెచ్చరించారు. బాంబులు, గీంబులు అంటే ఏం చేస్తారో అని అనుకున్నామని.. చూస్తే కొండను తవ్వి ఎలుకను బట్టారని ఎద్దేవా చేశారు. ‘ చేతనైతే రాజకీయంగా తలబడండి. ఇచ్చిన హామీల విషయంలో శాసనసభ పెట్టండి..రుణమాఫీ కావచ్చు.. మూసీ సుందరీకరణ కావచ్చు.. ఆరు గ్యారంటీల అమలు కావచ్చు.. ప్రతి అంశం మీద సావధానంగా చర్చించి మిమ్మల్ని ఎండగట్టడానికి కేసీఆర్ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నాం. కానీ ఈరకంగా గొంతునొక్కి, ఇష్టమొచ్చినట్లు కేసులు పెట్టి రాజకీయంగా మా కుటుంబసభ్యలును వేధించి ఏదో సాధిస్తామని అనుకుంటే మీరు సాధించేది ఏమీ లేదు’ అని స్పష్టం చేశారు.
ఇక కొన్ని మీడియా నేను అక్కడే ఉన్నానని.. ఐదు నిమిషాల కిందే పోయానని అన్నారని కేటీఆర్ తెలిపారు. కానీ తాను నిన్న సాయంత్రం 8 గంటల దాకా తమ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్తో ఎర్రవెల్లిలోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇంటికొచ్చి బుక్కెడంత తిని.. గంటసేపు టీవీ చూసి.. నా బిడ్డతో మాట్లాడి పడుకున్నానని తెలిపారు. తెల్లారి పొద్దున ఆరు గంటలకు లేచి ఈ మెసేజ్లు చూసుకున్నానని పేర్కొన్నారు. ఐదు నిమిషాల ముందు దాకా నేను అక్కడే ఉన్నానని అంటున్నారు.. ఎవరైనా చూశారా అని ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు వార్తలు వేయొచ్చా అని అడిగారు. నన్ను, నా భార్యను, నా కుటుంబసభ్యులను ఇష్టమొచ్చినట్లు అనొచ్చా? పబ్లిక్ లైఫ్లో ఉంటే మేమైనా పబ్లిక్ ప్రాపర్టీయా? ఏది పడితే అది అనొచ్చా? ఇది పద్ధతేనా? దయచేసి ఆలోచించండి అని మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేశారు.
రాజ్ పాకాల ఇవాళ ఏం తప్పు చేసిండు. ఆయన సొంతింట్లో దావత్ చేసుకుంటే రేవ్ పార్టీ అని పేరు పెట్టి.. దాన్నో సినిమా చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రికి చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నాయని.. రాష్ట్రంలో పోలీసోళ్లు పోలీసోళ్లను కొడుతున్నారని.. ఆ పనులను ఇడిచిపెట్టి ఇవేం పనులు అని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టినా.. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గమని.. తప్పకుండా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మీరు జైళ్లకు పంపించినా.. ఎక్కడికి పంపించినా.. ముమ్మాటికి కేసీఆర్ నేర్పిన ఉద్యమ బాటలోనే నడుస్తామని.. తెలంగాణ ప్రజల పక్షా మీ పరిపాలన వైఫల్యాలను, మీ అసమర్థతతను, మీ అవినీతిని ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గబోమని అన్నారు.