HMPV | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : హెచ్ఎంపీవీపై ప్రజలు ఆందోళన చెందవద్దని తెలంగాణ ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ స్పష్టంచేశారు. కేంద్రం మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. దవాఖానల్లో మందులు, సిబ్బంది, ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నామని తెలిపారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఇది 2001లోనే వచ్చిన పాత వైరస్ అని, చలికాలంలో వైరస్లు విజృంభించడం సాధారణమేనని యాదాద్రి భువనగిరి జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. భారత్‌లో నాలుగు కేసులు మాత్రమే నమోదైనట్టు తెలుస్తున్నదని, ప్రజలు అనవసర భయాలు పెట్టుకోవద్దని డాక్టర్ రాజారావు వెల్లడించారు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేదని, లక్షణాల ఆధారంగానే చికిత్స అందిస్తారని చెప్పారు.
తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, రోగిని తాగినప్పుడు, రోగి వస్తువులు వాడినప్పుడు
చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవాళ్లపైప్రభావం ఎక్కువ
మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను కడుక్కోవడం, లక్షణాలు కనిపిస్తే విడిగా ఉండటం, గుంపులు, రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండటం.