కరీంనగర్ : జిల్లా పరిధిలోని లోయర్ మానేరు డ్యాం నుంచి కాకతీయ కాల్వకు మంత్రి గంగలు కమలాకర్ సోమవారం ఉదయం నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, ప్రాజెక్టు అధికారులతో పాటు పలువురు పాల్గొన్నారు. వానాకాలం పంటలకు నీటిని విడుదల చేసిన మంత్రి గంగుల.. ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. లోయర్ మానేరు నుంచి కాకతీయ కాల్వలోకి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు మంత్రి గంగుల పేర్కొన్నారు. ఏడు జిల్లాల్లో సుమారు 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.
నేడు మేయర్ సునీల్ రావు గారు మరియు అధికారులతో కలిసి కరీంనగర్ దిగువ మానేర్ జలాశయం నుండి కాకతీయ కాలువ ద్వారా దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది@trspartyonline #Karimnagar #LowerManairDam pic.twitter.com/hgja61U57S
— Gangula Kamalakar (@GKamalakarTRS) July 12, 2021