Minister KTR | న్యూయార్క్ : న్యూయార్క్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో డిస్కవరీ ప్రతినిధులు భేటీ అయ్యారు. టెలివిజన్, చలనచిత్రం, స్ట్రీమింగ్, గేమింగ్‌లో విభిన్నమైన కంటెంట్, బ్రాండ్లు, ఫ్రాంచైజీల పోర్ట్‌ఫోలియోకు ప్రసిద్ధి చెందిన గ్లోబల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ సమ్మేళనం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తెలంగాణ వినోద రంగంలోకి ప్రవేశిస్తుంది. ఈ మేరకు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తెలంగాణ వినోద రంగంలోకి ప్రవేశిస్తోంది. తెలంగాణ వినోద రంగంలోకి డిస్కవరీ రావడం సంతోషకరం అని పేర్కొన్నారు. క్రియేటివిటీ, ఇన్నోవేషన్ హబ్‌గా ఐడీసీ(అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రం)ని డిస్కవరీ ఏర్పాటు చేస్తుందన్నారు. మొదటి ఏడాదిలోనే 1200 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ తెలిపారు.