KTR : రేవంత్ రెడ్డి సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవాళ అసెంబ్లీకి వచ్చిన ఆయనకు మీడియా ప్రతినిధులు ఎదురెళ్లి.. మీరు ఏం చేయబోతున్నారో చెప్పండని అడిగారు. అందుకు ఆయన స్పందిస్తూ రేవంత్ సర్కారు తమ మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసిందని, అందుకు సర్కారు సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
శాసనమండలిలో చర్చ జరుగుతున్నదని, అక్కడ తమ వైఖరి తెలియజేస్తామని కేటీఆర్ అన్నారు. మహిళా ఎమ్మెల్యేలపట్ల రేవంత్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. రేవంత్ సర్కారు సోమవారం మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించింది. ప్రభుత్వ తీరుపై సదరు ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టారు.
#WATCH | Hyderabad | Arriving at the Telangana Assembly to attend today’s session, BRS Working President KT Rama Rao says in Telugu, “Revanth Reddy’s government attacked our women MLAs yesterday. They must give an explanation.” https://t.co/EOwe22RZJN pic.twitter.com/m6dOqTloku
— ANI (@ANI) September 8, 2026