వరంగల్: మొంథా తుఫాను ప్రభావంతో వరంగల్ నగరం (Warangal) అతలాకుతమైంది. ఎడతెరపి లేకుండా కురిసిన వానతో వరంగల్ నగరం జలదిగ్బంధమైంది. వర్షం నిలిచిపోయినప్పటికీ వరంగల్ నగరంతోపాటు హనుమకొండ, కాజీపేట పట్టణాలను ఇంకా వరద వీడలేదు. ట్రైసిటీలో పలు కాలనీలు నీటమునిగాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హనుకొండలో రోడ్లన్నీ చరువులను తలపిస్తున్నాయి. వరంగల్ రైల్వే స్టేషన్ ఇంకా వర్షపు నీటితోనే నిండిపోయి ఉన్నది. వరంగల్లోని భద్రకాళి రోడ్డు వద్ద ఉన్న సరస్వతీ కాలనీ, వరంగల్ అండర్ బ్రిడ్జి రోడ్డు నీట మునిగిపోయాయి. పట్టణంలోని సుమారు 40కిపైగా కాలనీలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. సాయిగణేశ్ కాలనీ, సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్యనగర్, సమ్మయ్య నగర్లో వర్షపు నీరు ఇండ్లలోకి చేరింది.

కాగా, జిల్లా వ్యాప్తంగా 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని వరంగల్ కలెక్టర్ సత్య శారద చెప్పారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, రెండు రోజుల ముందే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని తెలిపారు. అన్ని మార్కెట్లు, స్కూళ్లకు సెలవులు ప్రకటించామని తెలిపారు. గర్భిణులు, రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రాంతాల ప్రజలకు ఆహారం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.


#WATCH | Telangana: Due to the impact of cyclone Montha, severe waterlogging witnessed in Warangal amid heavy rainfall in the region.#CycloneMontha pic.twitter.com/qIGrreTzut
— ANI (@ANI) October 30, 2025
Water everywhere in #Warangal! Hunter Road and Ramannapet are flooded again. Where’s the promised underground drainage system from the election campaigns? We need a permanent solution, not just promises#WarangalFloods @naini_rajender @HiWarangal @SudhaRani_Gundu @dasyamofficial pic.twitter.com/g3UOHr19hj
— Scorpion (@thebeliever051) October 30, 2025
#WATCH | Telangana: Due to the impact of cyclone Montha, severe waterlogging witnessed in Warangal amid heavy rainfall in the region. #CycloneMontha pic.twitter.com/0cbHJAwao3
— ANI (@ANI) October 30, 2025
#WATCH | Telangana | Warangal district Collector Dr Satya Sharada says, “In the entire Warangal district, the average rainfall was around 29 centimetres. We had anticipated the situation and started precautionary measures almost two days ago. Holidays were declared for all… https://t.co/mx0zcY0gq1 pic.twitter.com/fiQY9LdeTB
— ANI (@ANI) October 30, 2025