స్ట్టేషన్ఘన్పూర్, ఫిబ్రవరి 8: అన్ని రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఖతమవుతున్నదని స్థానిక సంస్థల ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇతర పార్టీల ఓట్లను చీల్చి బీజేపీ విజయానికి పరోక్షంగా కాం గ్రెస్ పార్టీ కృషి చేస్తున్నదన్నారు. కుల గణన పేరు తో బీసీల మోసం చేసిన సీఎం, ఎస్సీ వర్గీకరణ అంటూ మాల, మాదిగల మధ్య చిచ్చుపెడుతున్నాడని విమర్శించారు.
వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ చేపట్టిన ‘లక్ష డప్పులు- వేల గొం తుల’కు బీఆర్ఎస్, ఇతర పార్టీలు మద్దతు ఇస్తున్నాయనే ఉద్దేశంతోనే వర్గీకరణ చేస్తున్నట్టు ప్రకటించారని ఎద్దేవా చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాక్షస పాలన నడుస్తున్నదని చెప్పారు. ఇదే చివరి ఎన్నికలు అని కేసీఆర్‌ను వేడుకొని బీఆర్ఎస్తో గెలిచి, కూతురు కోసం ఆత్మాభిమానాన్ని కాంగ్రెస్‌కు కడియం శ్రీహరి తాకట్టు పెట్టారని ఆరోపించారు. మరికొద్ది రోజుల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉపఎన్నికలు వస్తాయని, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే రాజయ్యను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవడానికి నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కేశిరెడ్డి మనోజ్‌రెడ్డి కేఎంఆర్ చానల్లో కడియానికి వ్యతిరేకంగా వార్తలు పెట్టినందుకు కక్షపూరితంగా కేసులు పెట్టించారని మాజీ ఎమ్మెల్యే రాజయ్య వి మర్శించారు. 14 నెలల పాలనలో కడియం ఏడుగురిపై అక్రమ కేసులు పెట్టించారన్నారు. బేషరతు గా మనోజ్‌రెడ్డిని విడిపించాలని డిమాండ్ చేశారు.