మినీ పురపోరు.. 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు 30న పోలింగ్
మున్సిపల్ ఎన్నికలు | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల

హైదరాబాద్ : తెలంగాణలో మినీ పురపోరుకు సర్వం సిద్ధమైంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ ప్రక్రియ జరగనుంది. మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రేపట్నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 19న అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ ఈ నెల 22.
ఆ మూడు మున్సిపాలిటీలకు చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు
జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. జడ్చర్ల – బీసీ మహిళ, నకిరేకల్ – బీసీ జనరల్, కొత్తూరు – జనరల్ మహిళకు కేటాయించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అధికారులు లాటరీ తీశారు. ఇక వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట మున్సిపాలిటీకి రిజర్వేషన్ల జాబితాను సంబంధిత అధికారులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 66, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లకు, సిద్దిపేటలో 43 వార్డులకు, అచ్చంపేటలో 20, జడ్చర్లలో 27, కొత్తూరులో 12 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటితో పాటు వివిధ కారణాలతో ఖాళీ అయిన గజ్వేల్ మున్సిపాలిటీలోని 12వ వార్డుకు, నల్లగొండ మున్సిపాలిటీలోని 26వ వార్డుకు, జల్పల్లి మున్సిపాలిటీలోని 28వ వార్డుకు, అలంపూర్ మున్సిపాలిటీలోని 5వ వార్డుకు, బోధన్ మున్సిపాలిటీలోని 18వ వార్డుకు, పరకాల మున్సిపాలిటీలోని 9వ వార్డుకు, మెట్పల్లి మున్సిపాలిటీలోని 8వ వార్డుకు, బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 30వ వార్డుకు, జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌కు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి..
గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ రిజర్వేషన్లు ఖరారు
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు రిజర్వేషన్లు ఖరారు
సిద్దిపేట మున్సిపాలిటీకి రిజర్వేషన్లు ఖరారు
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. మరో ఉద్ధీపన ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం!
హాస్పిటల్లో బెడ్ ఇవ్వండి.. లేదా చంపండి?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

