గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ రిజర్వేషన్లు ఖరారు
గ్రేటర్ వరంగల్ | గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఇవాళ రిజర్వేషన్ల

వరంగల్ : గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఇవాళ రిజర్వేషన్ల జాబితాను విడుదల చేశారు. వరంగల్ నగర పరిధిలోని 66 డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు కాగా, 65వ డివిజన్ ఎస్టీ మహిళకు, 2వ డివిజన్ ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. 1, 3, 14, 43, 46 డివిజన్లు ఎస్సీ మహిళలకు, 15, 17, 18, 37, 47, 53 డివిజన్లను ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. 9, 16, 23, 25, 32, 33, 36, 38, 42, 54 డివిజన్లను బీసీ మహిళలకు, 6, 10, 12, 20, 21, 26, 34, 39, 40, 41 డివిజన్లు బీసీ జనరల్‌కు కేటాయించారు. 8, 11, 19, 24, 28, 29, 30, 44, 48, 49, 50, 55, 57, 58, 59, 63 డివిజన్లను జనరల్ మహిళలకు కేటాయించారు.
878 పోలింగ్ స్టేషన్లు
66 డివిజన్లలోని 298 ప్రాంతాల్లో 878 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహి స్తున్న నేపథ్యంలో ప్రతి పోలింగ్ స్టేషన్లలో 800 ఓట్లకు మిం చకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరమే పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగకుండా పర్యవేక్షణకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాలను ఎన్నికల అధికారి నియమించారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వర కు, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. ప్రతి బృందంలో తహసీల్లార్లు, ఇరిగేషన్ అ ధికారులు, పోలీస్ అధికారులు, వీడియో గ్రాఫర్ ఉంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

