హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఈ నెల 15నుంచి 18 వరకు జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) 17వ జాతీయ మహాసభలో తెలంగాణ నుంచి ఆరుగురు నేతలు ఎంపికయ్యారు. జాతీయ కార్యదర్శిగా వలి ఉల్లా ఖాద్రీ, జాతీయ వరింగ్ కమిటీ కార్యవర్గ సభ్యులుగా కల్లూరు ధర్మేంద్ర, నెర్లకంటి శ్రీకాంత్, జాతీయ సమితి సభ్యులుగా రామకృష్ణ, రవి, వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఎన్నికైన నేతలు మాట్లాడుతూ.. 17వ జాతీయ మహాసభల్లో యువజన, విద్యార్థి, మహిళా, కార్మిక, కర్షక సమస్యలపై చర్చలు జరిగాయని తెలిపారు.
పాలకులు అవలంబిసున్న విధానాలపై చర్చలు జరిపి, తీర్మానాల రూపంలో భవిష్యత్ పోరాటాలకు కార్యాచరణ రూపొందించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం యువతను మతంపేరుతో విభజిస్తున్న తీరును ఈ మహాసభలో ఖండించామని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హకులను హరిస్తున్న పాలకులపై సంఘటిత ఉద్యమాలు చేయాలని వారు పిలుపునిచ్చారు. భగత్‌సింగ్ జాతీయ ఉపాధిహామీ చట్టాన్ని రూపొందించి, అమలు చేయాలని డిమాండ్‌చేశారు.