హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): వరింగ్ జర్నలిస్టులకు వేజ్‌బోర్డును పునరుద్ధరించాలన్న ఐజేయూ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. హర్యానాలోని పంచకులలో శని, ఆదివారాల్లో నిర్వహించిన ఐజేయూ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కృత్రిమమేథ ప్రవేశంతో మీడియా రంగంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాసరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేవులపల్లి అమర్ దసరా ఉత్సవాల సందర్భంగా దత్తాత్రేయ నిర్వహించే ‘అలయ్ బలయ్’ ప్రాచుర్యాన్ని వివరించారు.