హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు (VRAs) మంత్రుల నివాస ప్రాంగణాన్ని ముట్టడించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వీఆర్ఏలు మినిస్టర్స్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, వీఆర్ఏలకు స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం మినిస్టర్స్ క్వార్టర్స్ మెయిన్ రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం, రెవెన్యూ మినిస్టర్ డౌన్‌డౌన్, వీ వాంట్ జస్టిస్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3797 మంది వీఆర్ఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని మాటిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు గడిచినా ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీఆర్ఏలు బారికేడ్లను తోసేసి ముందుకు పరుగులు తీశారు. పలువురు వి అ ఏ లు ఏకంగా భద్రతా వ్యవస్థలను దాటుకుంటూ క్వార్టర్స్ లోనికి చొచ్చుకుని వెళ్ళారు. పెద్ద ఎత్తున పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్కృతితో చోటుచేసుకుంది. దీంతో లాఠీఛార్జ్ చేసినా అదుపులోకి రాలేదు. ఒకవైపు వీఆర్ఏలు మరోవైపు పోలీసులు ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నించడంతో యుద్ధ వాతావరణం చోటుచేసుకుంది. సుమారు 45 నిమిషాల పాటు ఘర్షణ అనంతరం పోలీసులు పలువురు వీఆర్ఏలను అదుపులోకి తీసుకున్నారు.