Voter Slip | ఆన్లైన్లో ఓటర్ స్లిప్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి..?
Voter Slip | ఎన్నికల్లో తమకు ఓటు హక్కు ఉన్నదా? లేదా?, ఓటు హక్కు ఉంటే ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలనే దానిపై చాలా మందికి సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్రంలోని మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేసింది. ఈ నెల 25తో ఈ ప్రక్రియ పూర్తయింది. అయినా వివిధ కారణాల వల్ల ఇంకా కొందరికి ఓటరు స్లిప్పులు అందకపోవడంతో వాటిని ఓటర్లే నేరుగా పొందేందుకు ఎన్నికల సంఘం వీలు కల్పించింది.
హైదరాబాద్: ఎన్నికల్లో తమకు ఓటు హక్కు ఉన్నదా? లేదా?, ఓటు హక్కు ఉంటే ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలనే దానిపై చాలా మందికి సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తెలంగాణలోని మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేసింది. ఈ నెల 25తో ఈ ప్రక్రియ పూర్తయింది. అయినా వివిధ కారణాల వల్ల ఇంకా కొందరికి ఓటరు స్లిప్పులు అందకపోవడంతో వాటిని ఓటర్లే నేరుగా పొందేందుకు ఎన్నికల సంఘం వీలు కల్పించింది.
ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేయడం ద్వారా ఓటర్లు ఓటర్ జాబితాలో తమ పేరు ఉందా.. లేదా..? అని చెక్ చేసుకోవడంతోపాటు, సులువుగా ఓటర్ స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఓటర్ స్లిప్‌లో పోలింగ్ బూత్ వివరాలు, పోలింగ్ తేదీ, ఓటర్ సీరియల్ నంబర్ తదితర వివరాలు ఉంటాయి.
ఓటర్ స్లిప్ డౌన్లోడ్ ఇలా..
- ముందుగా నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ (NVSP) వెబ్‌సైట్‌ను https://www.nvsp.in లోకి వెళ్లాలి.
- సైట్ ఓపెన్ అయిన తర్వాత ఎలక్టోరల్ రోల్ టాబ్‌పై క్లిక్ చేయాలి.
- వెంటనే కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఓటర్ లిస్టులో మీ పేరుందా.. లేదా..? అని దానిలో రెండు మార్గాల్లో చెక్ చేసుకోవచ్చు.
- మొదటి మార్గంలో మీరు మీ పేరు, తండ్రి/భర్త పేరు, వయస్సు/పుట్టిన తేదీ, లింగం, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం ఎంటర్ చేయాలి.
- రెండో మార్గంలో ముందుగా మీ ఓటర్ ఐడీ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
- ఇలా మీరు ఇచ్చిన వివరాల ఆధారంగా వెబ్సైట్ మీకు మీ ఓటర్ సమాచారాన్ని చూపిస్తుంది.
- ఒకవేళ ఓటర్ లిస్టులో మీ పేరు లేకపోతే.. మీకు ‘నో రికార్డ్ ఫౌండ్’ అని సమాధానం వస్తుంది.
ఎస్సెమ్మెస్‌తో ఓటర్ లిస్టు చెక్ చేయడం ఎలా..?
- ముందుగా మీ మొబైల్లోని మెస్సేజ్ సెక్షన్లో EPIC అని టైప్ చేయాలి.
- ఆ తర్వాత స్పేస్ ఇచ్చి ఓటర్ ఐడీ కార్డు నంబర్‌ను ఎంటర్ చేయాలి.
- ఈ ఎస్సెమ్మెస్‌ను 9211728082 నంబర్‌కు లేదంటే 1950 నంబర్‌కు సెండ్ చేయాలి.
- వెంటనే మీ మొబైల్ స్క్రీన్ మీద మీ పోలింగ్ స్టేషన్ నంబర్, మీ పేరు డిస్ప్లే అవుతాయి.
- ఒకవేళ ఓటర్ లిస్టులో మీ పేరు లేకపోతే ‘నో రికార్డ్ ఫౌండ్’ అని సమాధానం వస్తుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
Accident | వలస కూలీల ట్రాక్టర్‌ను ఢీకొన్న టిప్పర్.. ఒకరు మృతి, 32 మందికి గాయాలు!
Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

