Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఓట రు జాబితా రూపొందించే ప్రక్రియ ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభంకానున్నది. వచ్చే మార్చి 29తో రాష్ట్రంలో మూడు ఎమ్మె ల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జి ల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీలు, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లా ల టీచర్ ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవ్వనున్నాయి. ఈ నెల 30వ తేదీ నుంచి ఓటరు నమోదు ప్రారంభంకానున్న నేపథ్యంలో సీఈవో సీ సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్హులైన వారందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు.
భట్టీ బ్రదర్స్.. వర్గీకరణపై వైఖరేమిటి?
ఖైరతాబాద్, సెప్టెంబర్ 24 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ మల్లు రవి.. ఎస్సీ వర్గీకరణపై తమ వైఖరిని తక్షణమే స్పష్టంచేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ జీ చెన్నయ్య డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని మాల సామాజికవర్గాలు అభివృ ద్ధి చెందాయనే తప్పుడు ప్రచారాన్ని చేసి, వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారని, వారి ఆర్థిక స్థితిగతు లు పరిశీలించాల్సిన అవసరం ఉంద ని చెప్పారు. వర్గీకరణతో మాలలు అధికంగా నష్టపోతారని పేర్కొన్నారు. మంత్రివర్గ ఉప సంఘానికి బదులు సిట్టింగ్ జడ్జితో కమిటీని ఏర్పాటు చేయాలని డిమాం డ్ చేశారు. మంత్రివర్గ ఉప సంఘం నుంచి మాల ప్రజాప్రతినిధులు వెంటనే తప్పుకొని, వారి వైఖరిని వెంటనే ప్రకటించాలని, లేకుంటే మాలల ద్రోహులుగా ప్రకటించి వారి ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కులగణనకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమని స్వయంగా ఏఐసీసీ నేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారని, మందకృష్ణ మాదిగకు చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీని ఒప్పించి కులగణనకు ఒప్పించాలని డిమాండ్ చేశారు.