డిపార్ట్మెంటల్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 25న వైవా వాయిస్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం టీజీపీఎస్సీ సెక్రటరీ ఒక ప్రకటనలో వెల్లడించారు.
డిపార్ట్మెంటల్ టెస్ట్(లాంగ్వేజెస్)లో క్వాలిఫై అయిన అభ్యర్థుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్లతో వైవా వాయిస్ టెస్ట్‌కు హాజరుకావాలని సూచించారు.