రాయపర్తి : రోడ్డు ప్రమాదం(Road accident)లో గాయపడి హహకారాలు చేస్తున్న క్షతగాత్రులను మంత్రి ఎర్రబెల్లి పరామర్శించడమేగాక ఆసుపత్రికి తరలించి దగ్గరుండి వైద్యం చేయించిన ఘటన బుధవారం చోటు చేసుకుంది.
వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం ఊకల్ శివారులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్(Brs Meeting)ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Errabelli )అటుగా వెళ్తున్నారు. మార్గమధ్యలో అప్పటికే రోడ్డు ప్రమాదానికి గురై, గాయపడిన యువకులు రోడ్డుపై విలపిస్తుండగా మంత్రి ఘటన స్థలం వద్ద ఆగి వివరాలు తెలుసుకుని స్వయంగా తొర్రూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్(Hospital) కు తీసుకెళ్లారు.
గాయపడిన యువకులకు దగ్గరుండి వైద్యం(Treatment) చేయించారు. వారికి అయ్యే ఖర్చులను తాను భరిస్తానని భరోసా ఇచ్చారు. గాయపడిన 13 మంది యువకుల్లో కేవలం నలుగురు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వారికి కూడా ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. మిగతా యువకులకు స్వల్పగాయాలు కావడంతో వారిని ప్రాథమిక చికిత్స చేయించి, ఇళ్లకు పంపించారు.